ఇద్దరు కలెక్టర్లపై బదిలీ వేటు
హైదరాబాద్: కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వరదల నష్టం తగ్గించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలోవిఫలమయ్యారనే ఉద్దేశంతో వారిని బదిలీ చేసింది. నెల్లూరు కలెక్టర్‌కె. ప్రవీణ్‌కుమార్‌ను, కడప కలెక్టర్ అథర్‌సిన్హాను ప్రభుత్వం గురువారం ఆకస్మికంగా బదిలీ చేసింది.వీరిద్దరికి పోస్టింగ్ ఇవ్వలేదు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎ. అనంతరాములును, కడప కలెక్టర్‌గా ఎయిడ్స్ ప్రాజెక్టు డైరెక్టర్‌కె. చంద్రమౌళిని నియమించారు. తక్షణమే బాధ్యతలుస్వీకరించాల్సిందిగా వీరిద్దరిని ప్రభుత్వం ఆదేశించింది.
అదే విధంగా కడప జిల్లా నీటిపారుదల శాఖ ఎస్‌ఇపై కూడా ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈయనకు కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సోమశిల ప్రాజెక్టు క్రెస్ట్‌గేట్లు ఎత్తేయడంలో నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మండిపడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏరియల్‌సర్వేకు వెళ్లినప్పుడు అధికారుల అలసత్వం వల్లనే తాము తీవ్రంగా నష్టపోయామని ప్రజలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆవిషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కలెక్టర్లపై చర్య తీసుకుంది.












Click it and Unblock the Notifications