కాల్పుల విరమణకు తాలిబన్లు రెడీ?

ఇస్లామాబాద్‌ః అమెరికా అదేపనిగా జరుపుతున్న దాడులతో బెంబేలెత్తిపోతున్న తాలిబన్లు పూర్తిగా లొంగిపోయినట్టుగా చెబుతున్నారు. కాల్పుల విరమణకు తాలిబన్లు చేసిన ప్రతిపాదనను పాకిస్తాన్‌లోని తాలిబన్ల రాయబారి అబ్దుల్‌ సలామ్‌ జయీఫ్‌ ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం వున్నదని అంటున్నారు.

తాలిబన్‌ నేత ముల్లా ఒమర్‌తో చర్చలకోసం గతవారంఅఎn్గాన్‌ వెళ్లిన జయీఫ్‌ కాందహార్‌లోని ఒక రహాస్య స్థావరంలో ఒమర్‌తో సుదీర్ఘంగా మంతనాల జరిపివచ్చినట్టుగా చెబుతున్నారు. ఒమర్‌ ఆదేశాలు మేరకు ఖరారు చేసిన కాల్పులవిరమణ ప్రతిపాదనపై ఆయన పాక్‌ అగ్రనేతలతో చర్చించనున్నట్టుగా తెలిసింది. గత రెండు రోజుల క్రితం కూడా అమెరికా దాడులు నిలిపివేస్తే లాడెన్‌ను తటస్థ దేశానికిఅప్పగిస్తామని తాలిబన్లు ఆఫర్‌ చేసిన విషయంవిదితమే.

అయితే ఇలాంటి ఆఫర్లను అమెరికాఅంగీకరించే స్థితిలో లేదు. అఎn్గాన్‌ విదేశాంగ మంత్రి వకీల్‌ ముత్తావకీల్‌ సైతం తాలిబన్లతో తెగతెంపులు చేసుకుని అమెరికా దాడులు నిలిపివేస్తే లాడెన్‌ను బంధించి ఇస్తామనిఅంటున్నట్టుగా తెలిసింది. ఇదిలా వుండగా అఎn్గాన్‌సంక్షోభం నివారణకు తాను తాలిబన్‌ అగ్రనేతలతో చర్చించి కొన్ని ప్రతిపాదనలు తెచ్చినట్టు జయీఫ్‌ చెప్పారు. అయితే ఆ ప్రతిపాదనలేమిటో వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+