బుష్, జెమిన్‌ల మధ్య ఒప్పందం
షాంఘై: ఇంటలిజెన్స్, ఉగ్రవాదంపై పోరుల్లో పరస్పర సహకారంఅందించుకోవాలని అమెరికా, చైనాలు ఒక అంగీకారానికి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్‌ల మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి.ఉగ్రవాదంపై పోరు- ఆర్థిక స్థితి అనే అంశంపై జరుగుతున్నఅపెక్ దేశాల సదస్సులో పాల్గొనడానికి బుష్ ఇక్కడికి వచ్చారు. తమ మధ్య గల సంబంధాలపై ఉభయ దేశాల నేతలు విస్తృత చర్చలు జరిపారు.
ఉగ్రవాదంపై పోరుకు అమెరికా అపెక్ దేశాల మద్దతును కూడగట్టుకోవడంలోవిజయం సాధించింది. చైనా వైఖరికి నిరసనగా తైవాన్ సదస్సును బహిష్కరించింది. తీవ్రవాదంపై పోరుకు ముసాయిదాను తయారు చేయడానికిఅపెక్ సదస్సు సన్నద్ధమవుతోంది. ప్రపంచ శాంతికి కలిసి పని చేయాలని బుష్, జెమిన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని దేశాల్లోని తీవ్రవాదాన్ని ఖండించాలని కూడా వారనుకున్నారు.












Click it and Unblock the Notifications