అధికారం గణంపై మండిపాటు
హైదరాబాద్‌ః తుపాను వరదల తాకిడి గురైన జిల్లాల్లో సహాయ చర్యలు చేపడుతున్న వివిధ ప్రభుత్వ శాఖలమధ్య సమన్వయం కొరవడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాల అంచనాల్లో కూడా ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల అధికారులతో ఆయన శుక్రవారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శరవేగంగా సహాయ కార్యక్రమాలు కొనసాగాలని ఆయన ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పంటలు వేయడానికివీలుగా రైతులకు అన్నిరకాల సాయం అందించాలని ఆయన ఆదేశించారు. ముందుగా కమ్యూనికేషన్లు, రహదారులు, వంతెనలను పునరుద్దరించాలని,విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకుఅయిదుకిలోల బియ్యం, కిరోసిన్ పంపిణీ ఎలా జరుగుతున్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications