హైదరాబాద్‌లోఅంత్రాక్స్ కవర్లు
హైదరాబాద్‌ః ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న అంత్రాక్స్ భయం జంటనగరాలకు కూడా సోకింది. శుక్రవారం నాడు అంత్రాక్స్ కవర్లను పోలీన అనుమానాస్పద కవర్లను రెండింటిని పోస్టల్ సిబ్బంది గుర్తించారు. వీటిని వెంటనే ప్లాస్టిక్ కంటెన్‌లో పెట్టి సీల్ చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ కవర్లలో ఒకటి కెనడా నుంచి బంజారాహిల్స్‌లోని ఒక అడ్రస్‌కు వచ్చిందని మరో కవర్ కర్ణాటక నుంచి వచ్చినట్టుగా వున్నదని పోలీసు కమిషనర్ రాములు చెప్పారు. ఎన్‌జిరంగా వ్యవసాయవిశ్వవిద్యాలయంలోని జీవరసాయన ప్రయోగశాలకు ఈ రెండు కవర్లను పంపించినట్టుగా ఆయన చెప్పారు.అంత్రాక్స్‌ను నిర్ధారించే పరీక్షలు కేవలం ఈ లాబ్‌లో మాత్రమే చేయగల అవకాశం వుంది. మరోవైపుఅంత్రాక్స్ ప్రమాదం వచ్చిపడితే తట్టుకోవడానికి తీసుకోవల్సిన చర్యలపై పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్టుగా రాములు తెలిపారు.అంత్రాక్స్‌ను గుర్తించడానికి అవసరమైన పరికరాలను కూడా యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications