పాక్‌ను అదుపు చేయండి: అద్వానీ వినతి
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరు జరిపే కూటమి సభ్య దేశమైన అమెరికా భారతదేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇవ్వకుండా చూడాలని హోం మంత్రి ఎల్.కె. అద్వానీ అన్నారు. పాకిస్థాన్ ఇంటర్‌సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన తాలిబాన్ ప్రభుత్వాన్ని బలపరుస్తోందని,అందువల్ల పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాట కూటమిలోసరైన సభ్య దేశం కాదని ఆయన అన్నారు.
అదే ఐఎస్‌ఐ జమ్మూ కాశ్మీర్‌లోనూ, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఉగ్రవాద చర్యలకు పథకాలు వేసి ప్రోత్సహించి మద్దతు తెలియజేస్తోందని ఆయనవిమర్శించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాట కూటమిలోని దేశాలు ఉగ్రవాదులకు, హైజాకర్లకు, తీవ్రవాద శిబిరాల నిర్వాహకులకు ఆశ్రయం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications