పాండిచ్చేరి ముఖ్యమంత్రి రాజీనామా
చెన్నై: పాండిచ్చేరి ముఖ్యమంత్రిపి. షణ్ముగం లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ రజనీరాయ్‌కు శుక్రవారం ఉదయం తన రాజీనామాను సమర్పించారు. షణ్ముగం కోసం తమసీట్లకు రాజీనామా చేయడానికి ఏ సభ్యుడు కూడా ముందుకు రాలేదు. దీంతో ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో షణ్ముగం రాజీనామా చేయాల్సి వచ్చింది.
సి. కన్నన్ నాయకత్వంలోని నలుగురు సభ్యులు గల పుదుచ్చేరి మక్కల్ కాంగ్రెస్ నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని పాలక కూటమిలోకి ఫిరాయించింది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి అన్నాడియంకె, తమిళ మనీలా కాంగ్రెస్‌ల మద్దతు లేకున్నా మనుగడ సాగించే బలం చేకూరింది. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటోంది.












Click it and Unblock the Notifications