పాండిచ్చేరి కొత్తనేతరంగస్వామి
చెన్నైః పాండిచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా పిడబ్లుడి శాఖ మంత్రి రంగస్వామి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధిష్టాన పరిశీలకులు గులాంనబి ఆజాద్ సమక్షంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సిఎల్‌పి సమావేశంలో రంగస్వామిని కొత్తనేతగా ఎన్నుకున్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి షణ్ముగం తన పదివికి అత్యంత అవమానకర పరిస్థితుల్లో రాజీనామా చేశారు. శాసనసభకు ఎన్నికకాకుండానే అధిష్టానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలుస్వీకరించిన షణ్ముగం ఆరునెలల్లో ఆసెంబ్లీకి ఎన్నికకావల్సివుంది. అయితే ఆయనకోసంసీటు ఖాళీ చేసిఇవ్వడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో ఆయన రాజీనామా చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఇంత అవమానకరమైన పరిస్థితిసీనియర్ నేతలకు ఎవరికీ ఎదురుకాలేదనివిలేకరుల సమావేశంలో ఆయన భోరున విలపించారు.












Click it and Unblock the Notifications