వరద ప్రాంతాల్లో సహాయచర్యలకు ఊపు
హైదరాబాద్: రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు ఊపందుకున్నాయి. వరదలు తగ్గు ముఖం పట్టడంతో అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. సహాయ చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వంటి సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి. వరదలకు వంద మంది దాకా బలయ్యారు. దాదాపు 40 మంది జాడ తెలియడం లేదు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని గుండ్లకమ్మ వాగు దాటుతూ గల్లంతయిన 14 మందిలో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.
టిటిడి హెలికాప్టర్‌ల ద్వారా బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీరు అందిస్తోంది. వరదలకు దెబ్బ తిన్న రైల్వే ట్రాక్‌ల, వంతెనల పునర్నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. రైళ్ల రాకపోకలు శుక్రవారం రాత్రి ప్రారంభం కావచ్చునని భావిస్తున్నారు. కడప జిల్లాలో వంద చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో గ్రామాలు ఇంకా జల దిగ్బంధనంలోనే కొట్టుమిట్టాడతున్నాయి. జమ్మలమడుగు జిల్లాలోని జమ్మలమడుగు మండలంలోని 23 గ్రామాలు ఇంకా జలదిగ్బంధనం నుంచి బయట పడలేదు. కర్నూలు జిల్లాలోని వాగులు, వంకలు శాంతిస్తున్నాయి.












Click it and Unblock the Notifications