ప్రతీకారం తీర్చుకుంటాం: తాలిబాన్
కాబూల్:అఎn్ఘానిస్థాన్‌లో దిగిన అమెరికా పదాతి దళాలను తిప్పికొడుతామని తాలిబాన్ అధికారి అన్నారు. అమెరికా చేసిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ బఖ్తర్ ఇన్‌ఫర్మేషన్ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ హనన్ హేమత్ అన్నారు. అమెరికా ప్రత్యేక బలగాలు దక్షిణ కాందహార్‌లో కాలు మోపినట్లు తాను ధృవీకరించలేనని, అయితే తాలిబాన్ ఆ బలగాల కోసం వేచి చూస్తోందని ఆయన అన్నారు.
ఈ పోరును మేం కోరుకోవడం లేదు. కానీ భూతల పోరు ప్రారంభమైతే మేం వైమానిక దాడుల కన్నా భూతల పోరునే కోరుకుంటాం అని ఆయన అన్నారు. యుద్ధరంగంలో మొదటి నుంచి, ప్రత్యేకంగా గత పాతికేళ్ల నుంచిఅఎn్ఘాన్లు తమ సత్తా నిరూపించుకుంటున్నారని ఆయన అన్నారు. గత పాతికేళ్లలో జన్మించిన ప్రతిఅఎn్గాన్‌కు ఏ విధంగా పోరాడాలనే విషయం తెలుసునని ఆయన అన్నారు.అఎn్ఘాన్‌లు జిహాద్‌కు సిద్ధంగా వున్నారని, ముఖ్యంగా తమ వందలాది మంది తమ ప్రజలను అమెరికా చంపిన ప్రస్తుత తరుణంలో మరింతగాజిహాద్‌కు సంసిద్ధులయ్యారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications