ఆర్టీసీ సమ్మెపై సర్కారు ప్రచారం
హైదరాబాద్‌ః అవాంఛనీయమైన కోరికలతో ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు వ్యతిరేకంగా తాము పెద్దఎత్తున ప్రజల్లో ప్రచారం ప్రారంభించనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం పార్టీ విస్తృత కార్యవర్గ స్థాయి సమావేశాలకు పరిశీలకులుగా వెళ్తున్నవారి సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది సమ్మె అనుచితమని ప్రకటించారు.సర్వీసును బట్టి తాత్కాలిక భృతిని ఇవ్వడానికి ప్రభుత్వంఅంగీకరించినప్పటికీ సిబ్బంది మొండివైఖరిని అవలంభిస్తున్నారని ఆయన చెప్పారు. సమ్మెపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలను ఆయనకోరారు. ఆర్ధికపరమైన డిమాండ్లలో ఆర్టీసీ ఉద్యోగులు హేతువును మర్చిపోతున్నారని ఆయనవిమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు వుండాలని డిమాండ్ చేయడాన్ని ఖండించారు. నష్టాల్లో వున్న ఆర్టీసీ సిబ్బంది కోరికలను భరించే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నిరోజులు సమ్మె చేసిన ప్రభుత్వ వైఖరి మారదని ఆయన స్పష్టం చేశారు. సమ్మె కాలానికి జీతాలు ఇచ్చే సమస్యే లేదని కూడా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications