అఎn్ఘాన్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు
వాషింగ్టన్, కాబూల్: అఎn్ఘానిస్థాన్‌లో తమ పదాతి దళాలు ప్రవేశించాయని వాషింగ్టన్‌లోని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పరిమిత సంఖ్యలో గల ప్రత్యేక బలగాలు దక్షిణ అఎn్ఘానిస్థాన్‌లోని నిఘా వేసి, అన్వేషించి తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తాయని ఆయన అన్నారు. సిఐఎ సూచనలకు అనుగుణంగా ఈ ప్రత్యేక బలగాలు దాడులు నిర్వహిస్తాయి. తాలిబాన్‌కు పట్టున్న ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయేలా నార్తర్న్ అలయెన్స్‌కు సహకారం అందించడం తమ ప్రధానోద్దేశ్యమని ఆయన తేల్చి చెప్పారు.
వైమానిక దాడులు సైనిక లక్ష్యాలను అన్నింటినీ ఛేదించలేవని, అందువల్ల పదాతి దళాలను అఎn్ఘానిస్థాన్‌లోకి పంపామని అమెరికా రక్షణ శాఖ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ చెప్పారు.
కాబూల్‌పై శుక్రవారంనాడు కూడా అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. అఎn్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. రంజాన్ మాసం వచ్చే లోగా అఎn్ఘానిస్థాన్‌పై దాడులను పూర్తి చేసి తన పని ముగించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇందులో భాగంగా అఫ్గనిస్థాన్‌లోకి పదాతి దళాలను కూడా ప్రవేశపెట్టింది.












Click it and Unblock the Notifications