పాక్‌పై ఒత్తిడికి అమెరికా సాయం
చెన్నై: ఉగ్రవాదులు దావూద్ ఇబ్రాహీంను, మౌలాన మసూద్ అజహర్‌ను పాకిస్థాన్ బారత్‌కు అప్పగంచేలా చేయడానికి అమెరికా సహకారం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు చెప్పారు.
వీరిద్దరిని పాకిస్థాన్ భారత్‌కు అప్పగించేలా చేయడం, వారిని బోనెక్కించడం తథ్యమని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. దావూద్ ఇబ్రాహీంను, అజహర్‌ను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించాల్సిందేనని ఆయన అన్నారు. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దావూద్ ఇబ్రాహీంను, అజహర్‌ను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించడం కూడా భాగమవుతుందని ఆయన అన్నారు.
దేశంలో సిమి తరహా సంస్థలను గర్తించామని, వాటిపై కూడా చర్య తీసుకుంటామని ఆయన అన్నారు. తీవ్రవాదులు ప్రార్థనా మందిరాల్లో తల దాచుకుంటే వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు వీలు కల్పించే చర్యలు చేపడ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications