కెమెండో ఆపరేషన్ ఆరంభం
వాషింగ్టన్‌ః అఎn్గానిస్తాన్‌లో భూతల పోరాటం ప్రారంభమయింది. యుద్ధం కీలక దశకు చేరుకుంటున్నదని అమెరికా నేత జార్జ్‌బుష్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు భూతల పోరు ప్రారంభమైందని ప్రకటించనప్పటికీ చిన్న చిన్న బృందాలుగా అఎn్గాన్‌లోని తాలిబన్ల కీలకస్థావరాల చెంత అమెరికన్ ప్రత్యేక దళాలు ఇప్పటికే మాటువేసి వున్నట్టుగా చెబుతున్నారు.
పెద్దసంఖ్యలో కమెండోలుఅఎn్గాన్‌లో అడుగుపెట్టలేదని ప్రపంచానికి ఇంతవరకు తెలియని ప్రత్యేక ఆయుధాలతో వేళ్లమీద లెక్కించగల సంఖ్యలో సుక్షితులైన కమెండోలు మాత్రమేఅఎn్గాన్‌లో అడుగుపెట్టారని అంటున్నారు.
అమెరికా అంచనాలు నిజమైతే రానున్న ఒకటి రెండు వారాల్లో ఈ కమెండోలు తమ పని పూర్తిచేసే అవకాశం వుంది. శీతాకాలం తీవ్రం కావడానికి ముందేఅఎn్గాన్ మిషన్ పూర్తిచేసే సన్నాహాల్లో అమెరికన్ బలాలు వున్నాయి.
గత పన్నెండు రోజులుగా సాగిస్తున్న వైమానిక దాడులతో చిన్నాభిన్నమైనఅఎn్గాన్‌లో తాలిబన్లపై మరింత వత్తిడి తేవడం కమెండో ఆపరేషన్ లక్ష్యంగా భావిస్తున్నారు. కమెండోలు రంగంలోకి దిగడంతో పుష్తూ తెగ తాలిబన్లతో తెగతెంపులు చేసుకుంటే అమెరికన్ల లక్ష్యం నెరవేరినట్టే. తాలిబన్లకు స్థానికుల మద్దతు లేకుండా చేసి వారిని తుడిచిపెట్టడంతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయడం అమెరికా తన ధ్యేయంగాపెట్టుకున్నది. తాలిబన్ ప్రభుత్వం కుప్పకూలితే ఒసామాబిన్ లాడెన్‌కు నిలువనీడ లేకుండా పోతుందని తేలిగ్గా బంధించవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications