వాజ్ పేయి విధానాలకు బ్రహ్మరథంః జానా
హైదరాబాద్‌ః భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తికి శనివారం హైదరాబాద్ లో ఘనంగాస్వాగతం లభించింది. బిజెపి అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జానా కృష్ణమూర్తి హైదరాబాద్ రావడం ఇదే ప్రథమం. న్యూఢిల్లీ నుంచి హైదారాబాద్ వచ్చిన జానాకు బిజెపి కార్యకర్తలు బేగంపేటవిమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి జానా కృష్ణ మార్తిటాప్ లేని జీపులో లేక్ వ్యూ అతిథి గృహం వరకు ఊరేగింపుగా వెళ్ళారు.
ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ ఈ సారి 300 స్థానాలు గెలుచుకొని సొంతబలంతో అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు హర్షధ్వానాల మధ్య ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జానా కృష్ణమూర్తి సాయంత్రం వరకు లేక్ వ్యూ అతిథి గృహంలో బస చేస్తారు. శనివారం సాయంత్రం కర్నూలు చేరుకుంటారు. కర్నూలులో జరుగుతున్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశంలో జానా కృష్ణమూర్తి పాల్గొంటారు. జానా కృష్ణమూర్తికి కేంద్ర మంత్రులువిద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, యు. కృష్ణరాజు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి తదితరులుస్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications