మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ ను పోలీసులు మళ్ళీ చర్లపల్లి జైలుకు తరలించారు. మేడ్చల్ పోలీసులు గురువారం అర్థరాత్రి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తిరిగి తరలించారు. ఇంజినీరింగ్ పరీక్షలు రాయడం కోసం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఈ చర్య తీసుకోబడింది.

మళ్ళీ జైలుకు బండి భగీరధ్

గతంలో జైలులో ఉన్న భగీరథ్ తన విద్యా సంవత్సరం నష్టపోకుండా పరీక్షలు రాయాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మానవతా పరిగణనతో షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన బెయిల్ మంజూరు కాగా, భగీరథ్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. బెయిల్ గడువు ముగిసిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, కట్టుదిట్టమైన భద్రతలో జైలుకు మార్చారు.

Bandi Bhageerath pocso case bhageerath sent back to Jail after completing exams on interim bail

చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా

బండి భగీరథ్‌పై 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసి, మానసికంగా వేధించి, ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు, లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మే 16వ తేదీన పెట్‌బషీరాబాద్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, పరీక్షలు రాయటం కోసం తాత్కాలికంగా బయటకు వచ్చాడు.

విచారణపై ప్రజలలో ఉత్కంఠ

పోలీసు వర్గాల ప్రకారం, ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. నిందితుడికి పరీక్షల కోసం మాత్రమే తాత్కాలిక ఊరట లభించిందని, కేసు విచారణ సాధారణ ప్రక్రియలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ హైప్రొఫైల్ కేసు తర్వాత విచారణపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల బండి భగీరధ్ విషయంలో కోర్టు మానవతా దృక్పథంతో విద్యార్థి భవిష్యత్తును పరిగణించి బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.

నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో!
నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో!

భగీరధ్ కేసులో ఏం జరుగుతుందో.. కొనసాగుతున్న ఉత్కంఠ

అయితే, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. బండి భగీరథ్ కేసు తెలంగాణ రాజకీయాలు, సమాజంలో తీవ్ర చర్చలకు దారితీసింది. మొత్తంగా బండి భగీరధ్ కేసులో ఏం జరుగుతుందో మాత్రం ఇంకా ఉత్కంఠగానే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+