Godavari Station: గోదావరి స్టేషన్లో ఈ రైళ్లకు స్టాప్ తొలగింపు..!
రాజమండ్రి వద్ద గోదావరి స్టేషన్ (Godavari Station) చాలా కీలకమైంది. ఇటువైపుగా వెళ్లే చాలా రైళ్లలో ప్రయాణికులు ఇక్కడ దిగుతుంటారు. అయితే ఈ స్టేషన్ లో పలు రైళ్లకు తాత్కాలికంగా స్టాప్ ను తొలగిస్తూ దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి స్టేషన్ తో పాటు గోదావరి స్టేషన్లోనూ పుష్కరాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల నేపథ్యంలో ఆటంకాలు లేకుండా ఈ స్టాప్ ను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇలా గోదావరి స్టేషన్లో స్టాప్ తీసేసిన రైళ్లలో కాకినాడ పోర్టు నుంచి విజయవాడకు వెళ్లే మెమూ ఎక్స్ ప్రెస్ రైలు 17258, రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లే మెమూ రైలు 67201, రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లే మెమూ రైలు 67261 ఉన్నాయి. ఇందులో కాకినాడ పోర్టు-విజయవాడ రైలుకు ఈ నెల 26 నుంచి ఆగస్టు 9 వరకూ స్టాప్ ను తీసేశారు. అలాగే రాజమండ్రి-విజయవాడ మెమూ రైళ్లకు సైతం ఇలాగే ఈనెల 26 నుంచి ఆగస్టు 9 వరకూ గోదావరి స్టేషన్ స్టాప్ ను రద్దు చేశారు.

ఇలా మొత్తం 45 రోజుల పాటు ఈ మూడు రైళ్ల ప్రయాణికులకూ గోదావరి స్టేషన్ స్టాప్ అందుబాటులో ఉండదు. కాబట్టి ప్రయాణికులు అందుకు అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి పుష్కరాల సమయంలో గోదావరి స్టేషన్ ద్వారా ప్రయాణాలు చేసే వారంతా దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications