నేడు Vivo, realme నుంచి కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంఛ్.. ఫీచర్స్ ఇవే !!!!
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు నేడు డబుల్ ట్రీట్ లభించనుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు వీవో (Vivo), రియల్‌మీ (Realme) భారత మార్కెట్లో తమ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా విడుదల చేయనున్నాయి. Vivo T5 Lite 44W 5Gతో పాటు Realme Narzo C100x నేడు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి.
లాంఛ్ వివరాలు..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు నేడు మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. లాంచ్ అనంతరం Flipkart, సంబంధిత బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్లలో బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, నో-కాస్ట్ EMI వంటి ప్రయోజనాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేలు, ఫాస్ట్ ఛార్జింగ్, AI కెమెరా ఫీచర్లతో ఈ రెండు ఫోన్లు బడ్జెట్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Vivo T5 Lite 5G ఫీచర్స్..
డిస్ ప్లే..
ఈ స్మార్ట్ ఫోన్ లో పెద్ద డిస్‌ప్లేతో పాటు స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను అందిస్తోంది. గరిష్టంగా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రాసెసర్..
మీడియాటెక్ Dimensity 6300 5G ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు మంచి పనితీరును అందించనుంది.
AI ఫీచర్స్..
ఈ ఫోన్‌లో అధునాతన AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. AI కెమెరా ఆప్టిమైజేషన్, AI ఫోటో ఎడిటింగ్, AI కాల్ క్లారిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి.
డిజైన్..
IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉండటంతో ఫోన్ బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
6500mAh బ్యాటరీ..
6500mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో కేవలం 38 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
కలర్స్..
ఈ ఫోన్ Wave Blue, Twilight Shadow అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది.
Realme Narzo C100x..
బ్యాటరీ..
బడ్జెట్ సెగ్మెంట్‌లో భారీ బ్యాటరీతో రియల్‌మీ కొత్త ప్రమాణాలు సృష్టించేందుకు సిద్ధమైంది. Realme Narzo C100xలో ఏకంగా 8000mAh బ్యాటరీను అందిస్తోంది. సాధారణ వినియోగంలో ఈ బ్యాటరీ మూడు రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. దీనికి 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
డిస్‌ప్లే..
Realme Narzo C100xలో 6.8 అంగుళాల 120Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేను అందించారు. ప్రత్యేకమైన Rain Touch Mode ఉండటంతో చేతులు తడిగా ఉన్నప్పటికీ స్క్రీన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.
కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ AI ప్రైమరీ కెమెరాను అందించగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
ప్రాసెసర్..
ఈ ఫోన్‌లో Unisoc T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, రోజువారీ వినియోగానికి ఇది సరిపడా పనితీరును అందిస్తుంది.
డిజైన్..
ఈ ఫోన్‌కు IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు 2 మీటర్ల డ్రాప్ ప్రొటెక్షన్ కూడా లభించింది. దీంతో చిన్నపాటి ప్రమాదాల్లో కూడా ఫోన్ సురక్షితంగా ఉండే అవకాశం ఉంది.
కలర్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ Deep Blue Tides, Golden Coast అనే రెండు స్టైలిష్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.













Click it and Unblock the Notifications