ఎత్తు పల్లాల బంగారం ధరలు.. నేడు కిలో వెండి ఎంతో తెలుసా?
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా దిగివచ్చాయి. నిన్నటి మార్కెట్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్, ఈరోజు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. స్థానిక బులియన్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం.. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి రకం 10 గ్రాముల బంగారం ధరపై రూ.280 మేర తగ్గింది. దీంతో నిన్నటి రేటు నుంచి దిగివచ్చిన పసిడి ప్రస్తుతం రూ.1,43,290 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 మేర తగ్గి రూ.1,31,350 కి చేరింది.
హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,329 గా ఉండగా, ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.13,135 వద్ద కొనసాగుతోంది. ఇదే రేట్లు ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లోనూ దాదాపు ఒకేలా నమోదయ్యాయి.

ఈ ప్రధాన నగరాలన్నింటిలోనూ 24 క్యారెట్ల పసిడి ఒక గ్రాముకు రూ.14,329 పలకగా, 22 క్యారెట్ల రేటు రూ.13,135 గా ఉంది. అదేవిధంగా ఈ నగరాల్లో సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10,747 వద్ద ట్రేడవుతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన చెన్నై, ఢిల్లీలలో మాత్రం పసిడి ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. చెన్నై మార్కెట్లో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ.14,346 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.13,150 వద్ద, 18 క్యారెట్ల ధర రూ.10,970 వద్ద ఉన్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఒక గ్రాము 24 క్యారెట్ల ధర రూ.14,344 గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.13,150 మరియు 18 క్యారెట్ల ధర రూ.10,762 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదొడుకులు, స్థానిక డిమాండ్ ఆధారంగానే ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు
మరోవైపు పసిడి దారిలోనే వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, వెండి మాత్రం పాత రికార్డు ధరల వద్దే నిలకడగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్ తాజా అప్‌డేట్ ప్రకారం ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ.2,40,000 పలికి ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications