ఆర్టీసీ రాజకీయంపై బాబు ఆగ్రహం
హైదరాబాద్‌ః ఆర్టీసి సమ్మెను రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం ఎగదోస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరుచుకు పడ్డారు. ఆర్టీసీ సమ్మెను అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు స్వప్రయోజనాలు సాధించుకొనేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ఓసమావేశంలో ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పాటైన పార్టీ అనుబంధ కమిటీల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ నేతలు, కార్యకర్తలుఅందరూ రాజకీయ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలనికోరారు. అభివృద్ధి పథకాల సమాచారాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మెను రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. ఆర్టీసీ సమ్మెలో మంగళవారం చెలరేగిన హింసకు బాధ్యులు ఎవరని ఆయన ఆవేశంగా ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications