నక్సల్స్ - పోలీసుల మధ్య హోరాహోరీ
నిజామాబాద్‌ః నిజామాబాద్ జిల్లా సదాశివపేట మండలం రామారెడ్డి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హోరాహోరీ కాల్పులు జరిగాయి. రామారెడ్డిలో వున్న పోలీస్ అవుట్ పోస్ట్ ను పేల్చి వేసేందుకు నక్సలైట్లు ప్రయత్నించారు. అందులో భాగంగా చుట్టుపక్కల వున్న కల్వర్టులను నక్సలైట్లు పేల్చి వేశారు. ఈ లోగా పోలీసులు అప్రమత్తం అయి కాల్పులు ప్రారంభించారు. దీనితో నక్సలైట్లు ఎదురు కాల్పులు జరిపారు.
ఇరువర్గాల మధ్య కనీసం నాలుగు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఆ తరువాత నక్సలైట్లు సమీపం లోని అడవుల్లోకి పారిపోయారు. పారిపోయిన నక్సలైట్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications