సాగునీటి పధకాలతోస్వర్ణాంధ్రః బాబు
హైదరాబాద్‌ః మరిన్ని సాగునీటి పధకాలు సాధించడంతో ద్వారాస్వర్ణాంధ్రప్రదేశ్ ను రూపొందిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రరాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ట్యాంక్ బండ్ పై గౌరవ వందనంస్వీకరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. గోదావరి పై నిర్మిస్తున్న దేవాదులలిఫ్ట్ స్కీం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌స్కీం అవుతుందని ఆయన చెప్పారు.
తీవ్రవాదులకు సిఎం పిలుపు
ప్రధాన జీవన స్రవంతిలో కలిసి అభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రవాదులకు పిలుపు నిచ్చారు. గురువారం నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టాంక్‌బండ్‌పై ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
విశాలాంధ్రసాధనకోసం ప్రాణాలుఅర్పించిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడుతున్నదని తీవ్రవాదుల చర్యలు తమ కష్టానికి అవరోధంగా తయారయ్యాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్రవాదంతో సాధించగలదేమీ లేదని ఆయన హితువు చెప్పారు. రాష్ట్రంలో నీటిపారుదులస్కీమ్‌లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మరో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేనున్నట్టుగా ఆయన వెల్లడించారు. వివిధ పాఠశాలల బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో పోలీసు, ఫారెస్ట్ అధికారులకు ముఖ్యమంత్రి శౌర్యపతకాలనుఅందజేశారు. తెలంగాణాను సస్యశ్యామలం చేయగల దేవాదుల గడువులోగా పూర్తవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications