వీధికెక్కిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్‌ః సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు వీధుల్లోకి వచ్చారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అందువల్ల సమ్మె అనివార్యమైందని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ చెప్పారు.
మొదట రెండు మూడు రోజులు ఎమర్జెన్సీ కేసులను చూస్తామని ఆ తర్వాత ఎమర్జెన్సీ కేసులను కూడా చూడమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎండీకోర్సును నాలుగేళ్ల వ్యవధిగల కోర్సుగా మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. పదివేల మంది జూనియర్ డాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టుగా ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications