టెస్టు సిరీస్‌లో ఆడతా: ద్రవిడ్
డర్బన్: దక్షిణాఫ్రికాలో జరిగే టెస్టు సరీస్‌లో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆడనున్నాడు. తాను ప్రస్తుతం టెస్టు సిరీస్‌లో రాణించడంపైనే దృష్టి కేంద్రీకరించానని ఆయన అన్నారు. మైదానంలో ఎక్కడి నుంచయినాసరే తాను బంతి విసరడానికి సిద్ధమేనని ఆయన ప్రకటించారు.
కుడి భుజం నొప్పి కారణంగా ద్రవిడ్ సిరీస్‌కు దూరంగా వుండడమే మంచిదని జరుగుతున్న చర్చలకు భారత టూర్ మేనేజ్‌మెంట్ బుధవారం తెర దించింది. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జోయ్ డీబీర్ వద్ద పరీక్ష చేయించుకున్న తర్వాత ద్రవిడ్ టెస్టు సిరీస్ ఆడడంపై అనుమానాలు తలెత్తాయి. టూర్‌లో అన్ని మ్యాచ్‌ల్లో ఆడడానికి రాహుల్ ద్రవిడ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని భారత మేనేజర్‌ఎం.కె. భార్గవ చెప్పారు. గత నాలుగేళ్లుగా అతడ్ని భుజం నొప్పి బాధిస్తోందిన ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications