వ్యాపారి కుమారుని కిడ్నాప్
హైదరాబాద్‌ః నగరానికి చెందిన ఒక వ్యాపారి కుమారున్ని పట్టపగలే ఆగంతకులు కిడ్నాప్ చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గగన్‌మహల్ వాస్తవ్యుడైన సురేష్‌చంద్ అగర్వాల్ యుఎస్‌ఎ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు నడుపుతున్నాడు.ఆయన కుమారుడు ఆశీష్ అగర్వాల్ కూడా ఆయనకు వ్యాపారంలో తోడుగా వుంటూ విడిగా ఒక ఎలక్ట్రానిక్ షో రూమ్ నిర్వహిస్తున్నాడు.
ప్రతిరోజులాగే ఆశిష్‌అగర్వాల్ కంట్రీక్లబ్‌లోని జిమ్‌కు వెళ్లి తిరిగివస్తుండగా నెక్లెస్ రోడులో గుర్తుతెలియని వ్యక్తులు కారును అడ్డగించి ఆశీష్‌ను కిడ్నాప్ చేశారు. ఈవిషయం అగర్వాల్ కుటుంబానికి ఫోన్ చేసి చెప్పారు. కిడ్నాప్‌విషయం పోలీసులకు తెలియజేస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని వారు హెచ్చరించినట్టుగా తెలిసింది.
కిడ్నాపర్లు రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఈవిషయం అగర్వాల్ కుటుంబం బయటకు తెలియనివ్వడం లేదు.అగర్వాల్‌ది ఉమ్మడి కుటుంబమని వారి ఇంటిలో 55 మంది సభ్యుల వరుకు వున్నారని పోలీసులు చెప్పారు. వారంత రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications