శ్రీశ్రైలంలో స్పృహతప్పిన కృష్ణకాంత్
శ్రీశైలంః ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గురువారం ఉదయం అలసట కారణంగా కొంతసేపు స్పృహతప్పి పడిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి దంపతులు గురువారం నాడుశ్రీశైల మల్లిఖార్జునుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్నకు రుద్రాభిషేకం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు ఉపవాసం వున్న కృష్ణకాంత్ పూజలు జరుగుతుండగా ఆలయంలో స్పృహతప్పారు.
వెంటనే ఆయన వ్యక్తిగత వైద్య సిబ్బంది చికిత్స చేశారు. సుమారు గంటన్నర తరువాత కృష్ణకాంత్ కోలుకున్నారు. బుధవారం నాడు కూడా కృష్ణకాంత్ దంపతులుశ్రీశైలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నవిషయం విదితమే.












Click it and Unblock the Notifications