వార్ మందుపాతరకు ఒకరు బలి
ఆదిలాబాద్‌ః ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు మందుపాతర పేల్చిన సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. జోడేఘాట్ మార్గంలో ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది.
కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లుతున్న వ్యవసాయ శాఖ జీపును నక్సల్స్‌పేల్చివేసినట్టుగా అధికారులు చెప్పారు. మరణించిన వ్యక్తి జీపు డ్రైవరని, వ్యవసాయ శాఖ ఉద్యోగులు ముగ్గురు గాయపడ్డారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications