మంగన్న విడుదలకు నక్సల్స్ డిమాండ్
హైదరాబాద్‌ః జనశక్తి గ్రూప్ నక్సల్స్ కిడ్నాప్ చేసిన కాంట్రాక్టర్ మార్తాండరావును విడుదల చేయాలంటే తమ పార్టీ నేత మంగన్నను విడుదల చేయాలని షరతు విధించారు. మంగన్న విడుదలతో పాటు మార్తాండరావుకు చెందిన మిగులు భూములను గ్రామ పంచాయతీ ద్వారా భూమిలేని పేదలకు పంచాలని డిమాండ్ చేసింది.
ఒక ప్రముఖ పత్రికకు చెందినవిలేకరిని జనశక్తి నక్సల్స్ మార్తాండరావును బంధించిన స్థలానికి తీసుకువెళ్లి తమడిమాండ్లను చెప్పడంతో పాటు మార్తాండరావుతో మాట్లాడించింది. తాను అన్నల చెరలో క్షేమంగానే వున్నానని వారి త్యాగాలుచూసి చలించిపోతున్నానని మార్తాండరావు అన్నట్టుగా ఆ పత్రికపేర్కొంది.
కేంద్ర మంత్రివిద్యాసాగారరావు తమకు సమీపబంధువన్న విషయం నిజమేనని అయితే బంధువైనంత మాత్రాన తనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తన విడుదలకోసం తన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్లను అంగీకరించకుండాకవ్వింపు చర్యలకు పాల్పడితే మార్తాండరావును చంపడం ఖాయమని నక్సల్స్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications