ఆర్టీసీ సమ్మెపైఆశాకిరణం
హైదరాబాద్‌ఃఆర్టీసీ సమ్మె ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.మంత్రివర్గ ఉపసంఘం ఆర్టీసీ యూనియన్ నేతలతోవిస్తృతంగా చర్చలు జరిపారు. ఆ తరువాత గురువారంరాత్రి మంత్రివర్గ ఉపసంఘం నేతలు తాజా ప్రతిపాదనలతోముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించారు.ఈ పరిణామాలతో 18 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెఓ కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సమ్మె ఎన్ని రోజులకూ తెగక పోవడంతో అసౌకర్యానికి ప్రజలుఅలవాటు పడిపోయారు.
రాజమండ్రి,విజయవాడ, తిరుపతి తదితర పట్టణాలలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. తిరుపతిలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులను ఆర్టీసీ సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసుల- కార్మికులకు మధ్య ఘర్షణ జరిగింది. విజయవాడలోఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రిక్షా కార్మికులు ప్రదర్శననిర్వహించారు.












Click it and Unblock the Notifications