ఆర్టీసి సమ్మె: జెఎసిలో కలతలు
హైదరాబాద్: కార్మిక నాయకుల మధ్య బుధవారం విభేదాలు తలెత్తడంతో ఆర్టీసి సమ్మెవిమరణకు సాగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమ మధ్య ఎలాంటి స్పర్థలూ లేవని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) నాయకుడుపి. రామ్మోహన్ రావు అన్నారు. అయితే పరిస్థితిఅందుకు విరుద్ధంగా వుంది. పైగా కలతలు నిజమేనని ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు బి. రామారావుఅంగీకరించారు. చర్చల మధ్యలో రామ్మోహన్ రావు లేచి బయటకు వచ్చారు. ఆయనను అనునయించేందుకు ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు బి. రామారావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌ఆర్. లక్ష్మయ్య ప్రయత్నించారు. అయినా రామ్మోహన్ రావు చర్చలకు వెళ్లలేదు. దీన్ని ఆర్టీసి కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)లో విభేదాలు తలెత్తినట్లు స్పష్టంగాఅర్థమవుతోంది.
బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో మంత్రి వర్గ ఉప సంఘం తరఫున టి. దేవేందర్ గౌడ్, బి.వి. మోహన్ రెడ్డి, జెఎసి తరఫున రామ్మోహన్ రావు, ఆర్.లక్ష్మయ్య, బి. రామారావు చర్చలకుహాజరయ్యారు. ఒక గంట తర్వాత హఠాత్తుగా రామ్మోహన్ రావు లేచి బయటకు వచ్చారు. ఆయన నేరుగా తన కారు వద్దకు వెళ్లి అక్కడే వుండిపోయారు.మిగిలిన ఇద్దరు నాయకులు కొద్ది సేపు చర్చలు సాగించి రామ్మోహన్ రావు వద్దకు వచ్చారు. ఆయనను అనునయించి లోనికి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే రామ్మోహన్ రావుఅందుకు అంగీకరించలేదు. ఇది గమనించిన విలేకరులు విభేదాల గురించి ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని రామ్మోహన్ రావు అన్నారు. తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లనే బయటకు వచ్చానని ఆయన చెప్పారు. అయితే ఎన్‌ఎంయు ప్రతినిధులు చర్చల్లో లేకపోవడాన్ని ప్రస్తావించగా అవసరం లేదని, తమ సహచరులు చర్చలను సమర్థంగా కొనసాగించగలరని ఆయన అన్నారు.
ఆ తర్వాత ఐదు నిమిషాలకు బయటకు వచ్చిన ఆర్.లక్ష్మయ్య, రామారావు తొలుతవిలేకరులతో మాట్లాడడానికి అయిష్టత వ్యక్తం చేశారు. అయితేవిలేకరులు పట్టు వీడకపోవడంతో జెఎసిలో ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్ల చర్చలు ముందుకు సాగటం లేదని వారు చెప్పారు. వేతన సవరణపై ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రతిపాదనలకు తమ అభిప్రాయం చెప్పాల్సి వున్నదని, కానీ తాము ఒక అవగాహనకురాలేకపోయామని వారు చెప్పారు. గురువారం జెఎసి ఏకాభిప్రాయానికి రాగలదని, ఆ తర్వాత మంత్రి వర్గం ఉపసంఘంతో కలిసి చర్చలు జరుపుతామని రామారావు చెప్పారు. జెఎసి నేతలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్లనే చర్చలు ముందుకు సాగలేదని మంత్రులు టి. దేవేందర్ గౌడ్, బి.వి. మోహన్ రెడ్డి ఆ తర్వాతవిలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications