బి-52 విమానాలతో దాడులు
కాబూల్‌ః అఎn్గాన్‌పై అమెరికా తన దాడులను గురువారం నాడు మరింత ముమ్మరం చేసింది. గత పదిహేను, ఇరువై రోజులుగా నిర్విరామంగా జరిపిన బాంబు దాడుల తర్వాత కూడా తాలిబన్లలో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో రెచ్చిపోయిన అమెరికాన్ సేనలు తాజాగా అత్యాధునికమైన బి-53 బాంబర్లను తొలిసారిగా రంగంలోకి దించారు.
ఇప్పటివరకు ఉపయోగించినవిమానాలకంటే వీటి విధ్వంసం మరింత తీవ్రంగా వుంటుంది. కజకిస్తాన్ సరిహద్దుల్లో తాలిబన్ల స్థావరాలుగా అనుమానిస్తున్న ప్రాంతాలపై ఈ బాంబర్లు ముమ్మరంగాదాడులు జరిపాయి. మరోవైపు అమెరికన్ కమెండో దళాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెరైనర్లు కూడా యుద్ధరంగానికి తరలివెళ్లారు.
అఎn్గాన్ గడ్డపైనే అమెరికన్‌సేనలు పాగావేసి సొంతగా స్థావరాన్ని ఏర్పాటు చేయడంతోపెద్దసంఖ్యలో పదాతి దళాలు బయలుదేరి వెళ్లుతున్నాయి. మరోవైపుఅఎn్గాన్‌లో విస్తృత ప్రాతినిధ్యం కల ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు సౌదీఅరేబియా మద్దతు ఇచ్చినట్టుగా బ్రిటన్ ప్రధాని బ్లెయిర్ చెప్పారు. సౌదీ, సిరియాల్లో పర్యటించిన అనంతరం ఆయన జోర్డాన్ బయలుదేరి వెళ్లారు.అఎn్గాన్ యుద్ధానికి ఇస్లాందేశాల మద్దతు కూడగట్టడానికి బుష్ ప్రతినిధిగా ఆయన దేశాలు తిరుగుతున్నవిషయం విదితమే.












Click it and Unblock the Notifications