ఒరొపెసాః అంతర్జాతీయ చెస్‌లో నిలకడగా రాణిస్తున్న కోనేరు హంపి, పెండ్యాల హరికృష్ణ బాటలో మరో తెలుగుతేజం ద్రోణవల్లి హారిక కూడా అంతర్జాతీయ రంగంలో జయపతాకను ఎగురవేసింది. ప్రపంచయూత్ చెస్ ఫెస్టివల్‌లో 12 ఏళ్ల బాలికల భాగంలో హారిక రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నది. మొత్తం 28 మంది భారత బాలల్లో హారిక మాత్రమే పతకం సాధించింది.
గ్రాండ్‌మాస్టర్లుగా ఆర్భంచడంతోహరికృష్ణ, కోనేరు హంపి యూత్ చెస్ పోటీలకు దూరంగా వున్నారు. దాంతో ఈ సారి భారత్‌నుంచి వెళ్లిన బృందంలో హారికపైనే పరిశీలకులు ఆశలుపెట్టుకున్నారు. గుంటూరుకు చెందిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరు ద్రోణవల్లి రమేష్,స్వర్ణ దంపతుల కుమార్తె హారిక 1999లో అండర్‌టెన్ భాగంలో స్వర్ణం సాధించింది.












Click it and Unblock the Notifications