న్యూయార్క్‌ః పాకిస్తాన్ కేంద్రంగా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సంస్థలు లష్కర్ ఎ తోయిబా, జైషేఎ మహమ్మద్‌ను నిషేధిస్తూ అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలతో మరికొన్ని సంస్థలను కూడా నిషేధించాలని భారత్ కొంతకాలంగా అమెరికాను కోరుతున్న షయం దితమే.
ఉగ్రవాద సంస్థలపై అమెరికా అటార్నీ జనరల్‌జాన్ అష్‌క్రాఫ్ట్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ రెండు సంస్థలపై నిషేధానికి అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రధాని వాజ్‌పేయి అమెరికా పర్యటనకు ముందుగా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని పరిశీలకులుఅంటున్నారు. అమెరికా నిర్ణయం పట్ల భారత రాయబారి లలిత్‌మాన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపుబ్రిటన్ కూడా తీవ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నది. బబ్బర్‌ఖల్సా, ఎల్‌టిటిఇతో సహా పలు తీవ్రవాద సంస్థల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications