అనంతపురంః అనంతపురం జిల్లా కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలను వరుసగా హత్య చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేయాలని నిర్ణయించారు. శనివారం నాడు అనంతపురం లోని కాంగ్రెస్ భవన్ లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం హత్యా రాజకీయాలను తీవ్రంగా నిరసించారు.
జిల్లాలోనిఅందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్లేలు ఇతర ప్రజాప్రతినిధుల రాజీనామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకిఅప్పగిస్తామని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనేత జె.సి. దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ చర్యతో అయని తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలకుస్వస్తి చెబుతుందనే అశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications