కరీంనగర్‌ః కరీంనగర్ జిల్లా జు్మకుంట పత్తిరైతులు ఆగ్రహంతో చెలరేగి పోయారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని అమ్మేందుకు రెండురోజులుగా పడిగాపులు పడుతున్నా ఆటు కాటన్ కార్పొరేషన్, ఇటు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శుక్రవారం రాత్రి మార్కెట్ యార్డులోపెద్ద ఎత్తున ధ్వంసం సృష్టించారు. మార్కెట్ యార్డు చైర్మన్ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. దీనితో జు్మకుంటలో ఉద్రిక్తత నెలకొంది.
నాణ్యతను బట్టి పత్తిని మూడు గ్రేడ్ లుగా భజించి కొనుగోలు చేయాలని సిసిఐ నిర్ణయించింది. అయితే వ్యాపారులు, దళారుల ఇష్టారాజ్యంగా మారడంతో రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. శుక్రవారం నాడు జిల్లాలోని ధ ప్రాంతాల నుంచి 15 వేల పత్తి బేళ్ళు మార్కెట్ యార్డుకు తరలి వచ్చాయి. అంతకు ముందు రోజునుంచి వందలాది మంది రైతులు స్టాకుతో పడిగాపులు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రానికి కేవలం వెయ్యి బేళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామంటూ అధికారులు ప్రకటించడంతో రైతులు రెచ్చిపోయి ధ్వంసం సృష్టించారు.
దేశవ్యాప్తంగా పత్తికి డిమాండ్ లేకపోవడం,అంచనాలకు ుంచి స్టాకు తరలి రావడంతో తక్కువగా కొనుగోలు జరుపుతున్నామని, రైతులుఅర్థం చేసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications