ఇస్లామాబాద్‌ః అవసరమైతే అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలను ప్రయోగించడానికి తాము సిద్ధంగా వున్నామని అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ హెచ్చరించారు.
తమ వద్ద రసాయన, అణ్వాస్త్రాలు వున్న షయం ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ పత్రిక డాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ ఈ హెచ్చరిక చేశారు. అమెరికా రసాయన, అణ్వాస్త్రాల ప్రయోగానికి దిగితే తాము అదే రీతిలో సమాధానం చెప్పడం ఖాయమని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌లోని అతిపురాతనమైన ఇంగ్లీష్ దినపత్రికల్లోఒకటైన డాన్‌కు ప్రజల్లో మంచి గౌరవాదరణలు వున్నాయి. డాన్‌లో వచ్చిన కారణంగా లాడెన్ వద్ద అణ్వాస్త్రాలు వుండే వుంటాయని భాస్తున్నారు.












Click it and Unblock the Notifications