బెంగుళూరుః సైబర్‌ నేరలను అరికట్టేందుకు దేశంలోనే ప్రప్రధమంగా కర్ణాటక ప్రభుత్వంఏర్పాటు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తొలికేసును జయవంతంగా దర్యాప్తు చేశారు.

ఈ కేసుకు సంబంధించి జయకుమార్‌ అనే ఇంజనీరునుఅరెస్టు చేశారు. అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీకి బెదిరింపు మెయిల్స్‌ ఇవ్వడామే కాకుండా ఆ సంస్థ ఇ-మెయిల్‌సర్వర్‌ను క్రాష్‌ చేసిన ఆరోపణపై జయకుమార్‌నుఅరెస్టు చేశారు. అమెరికాకు చెందిన ఫొనిక్స్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థకు జయకుమార్‌ బెదిరింపు ఇ-మెయిల్స్‌ ఇచ్చారని భారత్‌లో కార్యకలాపాలను కట్టిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుందని హెచ్చరించారని తెలిసింది.

ఈ ఇ-మెయిల్స్‌ను సంస్థ మొదట పట్టించుకోలేదు. అయితే అమెరికాలోని తమ ఇ-మెయిల్‌సర్వర్‌ కుప్పకూలడంతో వారు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించి దర్యాప్తు చేసిన అధికారులు ఈ మెయిల్స్‌ పంపింది జయకుమార్‌ అని కనిపెట్టారు. ఇటి చట్టం కింద జయకుమార్‌నుఅరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్‌ జుడిషియల్‌ రిమాండ్‌కుపంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+