కాబూల్‌ః అఎn్గానిస్తాన్‌లో ఇంకా కొన్ని కీలక ప్రాంతాలపై తాలిబన్ల పట్టు కొనసాగుతున్నప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకై ధ వర్గాలు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒకవైపు నెత్తుటేరులు పారుతుండగానే మరోవైపు సింహాసనంపై ఎవరు కూచోవలనే వాదం తీవ్రరూపం దాల్చింది.
మాజీ రాజు జహీర్‌షా, అధ్యక్షుడు రబ్బానీ, పుష్తూ తెగ నేతలు అధికారం తమకే దక్కాలని పంతంతో వున్నారు. మరోవైపు స్తృత స్థాయి ప్రాతినిధ్యం వున్న ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా ప్రకటించిన ఐక్యరాజ్యసుతి ఈ దిశగా సాగించిన సన్నాహాలు ప్రాధిుక దశలోనే వున్నాయి. జహీర్ షా తిరిగి కాబూల్‌లో అడుగుపెట్టడానికి రబ్బానీ వర్గం ఎంత వ్యతిరేకంగా వుందో రబ్బానీ వర్గంతో అధికారం పంచుకోవడానికి షా కూడా అంతే వ్యతిరేకంగా వున్నారు.
మరో వైపు dరిద్దరి షయంలో పాకిస్తాన్‌కు ఏ మాత్రం సదభిప్రాయం లేదు.జలాలాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే పుష్తూ నేతలు పాలనాధికారాన్ని సొంతం చేసుకున్నారు. అధికారం తమదేనని ప్రకటించుకున్నారు. వారితో ఘర్షణకు దిగే సాహసం నార్తర్న్ అలయన్స్ నేతలకు కూడా లేదనిఅంటున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పాటు అంత తేలిక కాదని ఐక్యరాజ్యసుతి ఈ షయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications