కాబూల్‌ః అందర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ అఎn్గానిస్తాన్ డిచి పారిపోయినట్టుగా తాలిబన్లు ప్రకటించారు. లాడెన్ అఎn్గాన్‌లో లేడని పాకిస్తాన్‌లో తాలిబన్ల రాయబారి అబ్దుల్ సలెం జయీఫ్ చెప్పారు. భార్యలు, పిల్లలను వెంటేసుకుని లాడెన్ అఎn్గాన్ వదిలి పారిపోయాడని ఆయన ఎక్కడికి వెళ్లింది తమకెవ్వరికీ తెలియదని జయీఫ్ చెప్పారు.
అయితే అమెరికా మాత్రం ఈ మాటలను శ్వసించడం లేదు. అలాగని లాడెన్‌అఎn్గాన్‌లోనే వున్నాడని కూడా భాంచడం లేదని అమెరికా అధికారు చెబుతున్నారు. ఇదిలా వుండగా లాడెన్‌కు పదిమంది డూప్‌లు వున్నారనిఅందువల్ల లాడెన్‌ను పట్టుకోవడం అమెరికా తరం కాదని అల్‌ఖైదా ఉగ్రవాదులుఅంటున్నారు.
తాలిబన్లు ప్రపంచదేశాలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని లాడెన్ కాందహార్‌లోనే వున్నాడని నార్తర్న్ అలయన్స్ కమాండర్లు చెబుతున్నారు. ఎ సందులో దాగినా లాడెన్ పట్టి బయటకు లాగుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమెరికా బాంబింగ్ నిలిపివేస్తుందనే ఆశతో లాడెన్ పారిపోయినట్టుగా తాలిబన్లు ప్రచారం చేస్తున్నారని వారుఅంటున్నారు.












Click it and Unblock the Notifications