న్యూఢిల్లీఃసోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతలు ఆదివారంనాడు ఎన్‌టిఆర్ భవన్‌లో సమావేశమై చర్చించారు. పార్టీ అగ్రనేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొని పార్లమెంట్ సభ్యులకు పలు సూచనలు ఇచ్చారు. కేంద్రం దృష్టికి తేవల్సిన ధ అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.
పోటో, అయోధ్యపై శ్వహిందూపరిషత్ నేతల హడావుడి, తహల్కా నేపథ్యంలో మళ్లీ మంత్రిపద చేపట్టిన జార్జ్ ఫెర్నాండెజ్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చాయి. పార్లమెంట్‌లో ఈఅంశాలపై పక్షాలు వాదాన్ని లేవనెత్తే అవకాశం వున్న దృష్ట్యా దేశం సభ్యులు ఎలాంటి వైఖరిని అవలంభించాలో చంద్రబాబు సూచించారు.
పెండింగ్ ప్రాజెక్టులపై గట్టిగా కేంద్రంపై వత్తిడి తేవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా పెండింగ్‌రైల్వే, ఇరిగేషన్ ప్రాజెక్టుల షయంలో కేంద్రం నాన్పుడు ధోరణిపై కొందరు ఎంపిలు ఆరోపించారు. కరవు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురయినప్పుడు కేంద్రబృందాలు వచ్చిపోవడమే తప్ప సాయం మాత్రంఅందడం లేదని వారు మర్శించారు. ఈ సమస్యలన్నింటిపై కేంద్రాన్ని నిలదీసి ఫలితాలను సాధిస్తామని దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications