పోర్ట్ ఎలిజిబెత్‌ఃఆరుగురు భారత క్రికెటర్లపై క్రమశిక్షణ వేటు వేస్తూ వాదాస్పద నిర్ణయం తీసుకున్న క్రికెట్ రిఫరీ మైక్ డెనిస్ పై మర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెనస్ కు రిఫరీ పద నుంచి ఉద్వాసన చెప్పారలని బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా డిమాండ్ చేశారు. భారత్ ఆడనున్న మూడోటెస్ట్ కు డెనిస్ రిఫరీగా వుండరాదు... లేకుంటే భారత్ ఆటగాళ్ళపై ధించిన శిక్షలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు దాల్మియా ఐసిసికి లేఖర రాస్తున్నట్లు చెప్పారు.
మంగళవారం నాడు దక్షిణాఫ్రికాలో లేకరులతో మాట్లాడిన డెనిస్ పై లేకర్లు ప్రశ్నల వర్ష కురిపించారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు ఆయన చెప్పినప్పటికీ భారత్ ఆటగాళ్ళపై మాత్రమే చర్య తీసుకొని, అదే ధమైన తప్పులు చేసిన పొలాక్, కలిస్ లపై ను వదిలివేయడంలోని అంతరార్ధాన్ని ఆయన వరించలేకపోయారు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ద్వంద్వ ప్రమాణాలతో కూడుకొని వున్నట్లు పలువురు ప్రముఖ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.
సచిన్ టాంపరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించే ముందు ఆటగాడిగా సచిన్ గొప్పతనాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందని లిటిల్ మాస్టర్ గవాస్కర్ అన్నారు. సచిన్ అభిమానులు కూడా రిఫరీ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications