బిసిసిఐ డిమాండ్‌పై పరిశీలన: ఐసిసి
ముంబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్‌ను తొలగించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) డిమాండ్‌ను పరిశీలిస్తామని, అయితే తాము చేయగలిగేది తుక్కవేనని ఐసిసి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మాల్కమ్ స్పీడ్ అన్నారు. తాము లండన్ వెళ్లిన తర్వాత ఐసిసి వైఖరి గురించి పరిశీలిస్తామని ఆయనస్టార్ న్యూస్‌కు ముంబాయిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాము చేయగలిగేది తక్కువే, అయితే బిసిసిఐ డిమాండ్‌ను సునిశితంగా పరిశీలిస్తామని ఆయన అన్నారు.
నిబంధనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. అ చాలా స్పష్టంగా వున్నాయి. సడలిస్తూ పోతే ఉన్న నిబంధనలకుఅర్థం లేదు అని ఆయన అన్నారు. దీన్ని బట్టి బిసిసిఐ డిమాండ్‌కు అనుకూలమైన నిర్ణయం ఐసిసి నుంచి వచ్చే అవకాశాలు లేవనిఅర్థం చేసుకోవచ్చు. తన చర్యపై లేవనెత్తిన ప్రశ్నలకు డెన్నిస్ సమాధానాలు ఇవ్వకపోవడాన్ని సమర్థిస్తూ- డెన్నిస్ వ్యాఖ్యలు చేయడానికి అవకాశం లేదని,అందువల్ల ఆయనపై మర్శులు చేయడం తగదని, మాట్లాడడానికి ఆయనకు అనుమతి లేదని స్పీడ్ అన్నారు.












Click it and Unblock the Notifications