మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై ఉత్కంఠ
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపైసర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు మూడు రోజులుగా మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపనై ముఖ్యమంత్రి చేస్తున్న కసరత్తు చివరిఅంకానికి చేరుకుంది. మంత్రి పదవులు ఆశిస్తున్న శాసనసభ్యులు ఆదివారం ముఖ్యమంత్రిని కలుసుకుని తమ వాదనలు చెప్పుకున్నారు. నాయకుల, శాసనసభ్యుల రాకతో ముఖ్యమంత్రి నివాసం వద్ద సందడి చోటు చేసుకుంది.అరవై మందికి పైగా ఆదివారంనాడు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. అన్ని జిల్లాల నుంచి శాసనసభ్యులు, నాయకులు రాజధాని నగరానికి తరలి వచ్చారు. దీంతో జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలువెలవెలబోయాయి. గతంలో మంత్రులుగా పని చేసినసీనియర్ శాసనసభ్యులు, ప్రస్తుత మంత్రులు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.
సోమవారం జరిగే మంత్రి పునర్వ్యస్థీకరణలో చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి స్థానం ఖాయమనిఅంటున్నారు.
గోపాలకృష్ణారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకునే పక్షంలో సమాచార, పౌర సంబంధాల మంత్రి ఎన్. శివప్రసాద్‌కు ఉద్వాసన తప్పకపోవచ్చుననిఅంటున్నారు. అదే రకంగా గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ కోడెల శివప్రసాద్‌ని కూడా మంత్రిగా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. శివప్రసాద్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే సాంకేతిక ద్యా మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు ఉద్వాసన చెప్పవచ్చు.కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు బి.. మోహన్ రెడ్డిని,కె. జయరామారావును పిలిపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిఎస్వీ సుబ్బారెడ్డితో కూడా చంద్రబాబు మాట్లాడారు.
ఇదిలా వుంటే, ఆరేడు మంది మంత్రులకు ఉద్వాసన చెప్పవచ్చుననిఅంటున్నారు. ఉద్వాసనకు గురయ్యే మంత్రుల్లో పుష్పలీల, మణికుమారి, పడాల భూమన్న తదితరులపేర్లు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి వర్గం పునర్వ్యస్థీరణకు ముందే కొత్త మంత్రులపేర్లను ముఖ్యమంత్రి ప్రకటించవచ్చునంటున్నారు. ఉద్వాసనకు గురయ్యే మంత్రులసంఖ్య 8 నుంచి పది వరకు కూడా వుండవచ్చునంటున్నారు.












Click it and Unblock the Notifications