సిఎల్‌పి తీరుపై ఎమ్మెస్సార్‌సీరియస్
హైదరాబాద్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) తగాదాలకు వేదిక కావడాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కుటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు తప్పు పట్టారు.
ప్రతి దానికి సిఎల్‌పి వేదిక అవుతోందని ఆయన ఆదివారం dుడియా ప్రతినిధులతో అన్నారు. సిఎల్‌పిలో పెరుగుతున్న క్రమశిక్షణా రాహిత్యంపై ఈ నెల 28వ తేదీన జరిగే జిల్లా కాంగ్రెస్ కుటీ (డిసిసి)ల అధ్యక్షుల సమావేశంలో చెప్పుతానని ఆయన అన్నారు. కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టుపై సిఎల్‌పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ పార్టీ శాసనసభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాట్లాడడాన్ని సత్యనారాయణరావు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అలా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications