తీవ్రవాదుల దాడి- నలుగురు బలి
శ్రీనగర్: జమ్మూ- శ్రీనగర్ జాతీయ రాహదారిపై జవహర్ టన్నెల్ దగ్గరలో గల భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదాలు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతాధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు.
భారీ ఆయుధ సామగ్రితో ఉగ్రవాదులు ఆదివారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో భద్రతా బలగాల శిబిరంపై దాడి చేశారు. ఇందులో ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఒక ఇండోటిబెటన్ బోర్డర్ పోలీసు అధికారి, ఒక పౌరుడు బలయ్యారు.
టన్నెల్‌కు నష్టం జరగకపోయినప్పటికీ కాశ్మీర్‌కు ఇతర ప్రాంతాలకు ఉన్న సంబంధం దీంతో తెగిపోయింది.












Click it and Unblock the Notifications