లాల్లూ లొంగుబాటు యాత్ర
పాట్నా: జార్ఖండ్‌లోని రాంచీ కోర్టు ముందు లొంగిపోవడానికి రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్భాటంగా యాత్ర ప్రారంభించారు. ఆయన ఆదివారంనాడు భారీ కాన్వాయ్‌తో పాట్నా నుంచి బయలుదేరారు. ఆయన రాంచీ కోర్టు ముందు సోమవారం నాడు లొంగిపోతారు.
దాణా కేసులో ఆయన కోర్టు ముందు లొంగిపోవడానికి సిద్ధపడ్డారు.
తనకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకంతోనే కోర్టు ముందు లొంగిపోతున్నానని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై యుద్ధం తాను యుద్ధం చేస్తానని ఆయన చెప్పారు. ప్రజాదరణ ఉన్న నాయకులను బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని, జైళ్లకు పంపుతోందని ఆయన దుయ్యబట్టారు. ఆయనతో పాటు బీహార్ మంత్రులు, అధికారులు పలువురు బయలుదేరారు. ఆయన మార్గమధ్యంలో పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. జార్ఖండ్ బిజెపి పాలిత రాష్ట్రం కావడంతో లల్లూ ప్రసాద్ యాదవ్ ఈ హంగామా చేస్తున్నారు.
తన భర్త లాల్లూ ప్రసాద్ యాదవ్ ప్రాణాలకు జార్ఖండ్‌లో ప్రమాదం ఉన్నదని బీహార్ ముఖ్యమంత్రి రబ్రీదే ఆందోళన వ్యక్తం చేశారు. లాల్లూ ప్రసాద్ యాదవ్ కోర్టు ముందు లొంగిపోవడం వల్ల తన ప్రభుత్వంపై ఏరకమైన ప్రభావం వుండదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications