కోల్‌కత్తా: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)కి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి మధ్య తలెత్తినవివాదం పరిష్కారమైంది. దక్షిణాఫ్రికాలో మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ ఆరుగురు భారత క్రీడాకారులకు విధించిన శిక్షతో ఈ రెండింటికీ మధ్యవివాదం తలెత్తింది.

ఇంగ్లాండుతో మొహలీలో జరిగే తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్‌కుషెహవాగ్‌ను ఎంపిక చేయకూడదని ఐసిసి షరతుపెట్టింది. దీన్ని బేఖాతరు చేస్తూ తొలి టెస్టుకుషెహవాగ్‌ను ఎంపిక చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. గత మూడు రోజులుగా టెలిఫోన్‌లోఐసిసి, బిసిసిఐ అధికారులకు మధ్య జరిగిన నిరంతర చర్చల ఫలితంగా సమస్య కొలిక్కి వచ్చింది. ఇంగ్లాండుతో డిసెంబర్ 3వ తేదీ నుంచి మొహలీలో జరిగే తొలి టెస్టులోషెహవాగ్ ఆడబోడని బిసిసిఐ కార్యదర్శి నిరంజన్ షా చెప్పారు. డెన్నిస్ విధించిన శిక్షలను సమీక్షించడానికి ఒక కమిషన్ వేయడానికి ఐసిసిఅంగీకరించిందని కూడా ఆయన తెలిపారు.
ఒప్పందం కుదరడంతో శనివారం ఐసిసి చైర్మన్ మాల్కం గ్రే, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మాల్కం స్పీడ్‌లకు, బిసిసిఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియాకు మధ్య తలపెట్టిన కౌలాలంపూర్ చర్చలు రద్దయ్యాయి. ఒక సందర్భంలో కౌలాలంపూర్ వెళ్లడానికి దాల్మియా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

Click it and Unblock the Notifications