చిత్తూరుః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరీ దేవికి చెందిన హెరిటేజ్ ప్లాంట్ నుపీపుల్స్ వార్ నక్సలైట్లు గురువారం రాత్రి పేల్చి వేశారు. చిత్తూరు జిల్లాలోనిపీలేరులో వున్న హెరిటేజ్ ప్లాంట్ పై గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలోపీపుల్స్ వార్ ప్రజాగెరిల్లా సమితి సభ్యులు దాడి చేశారు. ఈ దాడిలో ఫ్యాక్టరీకి కనీసం 20 లక్షలరూపాయల ఆస్తి నష్టం సంభవించిది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసివివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లాలో తగ్గుముఖం పడుతున్నదనునుకున్న వార్ ఏకంగా ముఖ్యమంత్రి ఆస్తులపైనా గురి పెట్టడం సంచలనం సృష్టించింది.
సుమారు 20 మంది నక్సలైట్లు వస్తూనే గాలిలోకి కాల్పులు జరుపుకుంటూ ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు.సెక్యూరిటీ ఉద్యోగులు ఇద్దరిని చితక బాదారు. ఆ తరువాత ఫ్యాక్టరీ లో వున్న 30 మందిని మైదానంలోకి తీసుకువెళ్ళి నిర్బంధించారు. ఆ తరువాత ప్లాంట్ లో వున్న యంత్రాలకు డిటొనేటర్లు అమర్చిపేల్చి వేశారు. ప్లాంట్ లోని రిఫ్రిజిరేటర్, ప్యానల్ బోర్డు తదితర యంత్రాలు దెబ్బతిన్నాయి.ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లకు నిరసనగానే ప్లాంట్ నుపేల్చి వేస్తున్నామని, మీకు ఎటువంటి హాని చేయమని నక్సలైట్లు చెప్పినట్లు హెరిటేజ్ ప్లాంట్ సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications