హైదరాబాద్‌ఃకమ్యూనిస్టు కృరువృద్ధుడు, కార్మికోద్యమ ప్రముఖుడు, సిపిఎం నేత నండూరి ప్రసాదరావు గురువారం కన్నుమూశారు. 91 ఏళ్లు ప్రసాదరావు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెతో పాటు రెండు మూత్రపిండాలు పనిచేయని కారణంగా మరణించారు. కృష్ణా జిల్లా అలుగొలను గ్రామంలో పుట్టిన ప్రసాదరావు బెనారస్‌విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.
1934లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ప్రసాదరావు రైతులు, వ్యవసాయ కార్మికులతో కలిసి పనిచేశారు.1964లో వామపక్షాలు చీలిన సమయంలో సిపిఎంలో చేరి కేంద్రకమిటీ సభ్యునిగా వున్నారు. ఆంధ్రరాష్ట్రంలో జరిగిన వివిధ రైతుపోరాటాలకు నండూరి సారధ్యం వహించారు. తెలంగాణా సాయుధపోరాటంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన నండూరి మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications