న్యూఢిల్లీః ఉగ్రవాదం కబంధహస్తాల్లో యావత్ ప్రపంచం చిక్కుకొని వున్నదని, ఈ దుస్థితి సత్వరమే తొలగిపోతుందని భారత ప్రధాని వాజ్‌పేయి ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రవాదం ప్రపంచాన్ని కుదిపివేస్తున్నది..... అయితే ఈ మహమ్మారి నుంచి మనం త్వరలో బయటపడతాం అని గురునానక్ జయంతి సందర్భంగా తనను కలుసుకొనేందుకు వచ్చిన సిక్కులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వాజ్‌పేయి అన్నారు. శాంతి సామరస్యాలపై అపారమైన గౌరవం వుండబట్టే మతం, కులం, జాతిపేరిట విభేదాలు సృష్టించటాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. పదిమంది కూడాని చోటే నాకు విశ్రాంతి లభిస్తుందని వాజ్‌పేయి చలోక్తి విసిరారు.
మదన్ లాల్ ఖురానా, సుష్మాస్వరాజ్ లతో కలిసి సిక్కులతో పాటు ఆయన మతపరమైన ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ రోజున భీకర యుద్ధం జరుగుతున్న ఆప్ఘనిస్తాన్ పట్టణాల్లో సైతం గురునానక్ ప్రభోధాలు మారుమోగేవని వాజ్‌పేయి అన్నారు.












Click it and Unblock the Notifications